మేళ్లచెరువు(చింతలపాలెం),వెలుగు: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో నిర్మిస్తున్న ఇన్నోవెరా లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ తమకొద్దని గ్రామ యువకులు తేల్చిచెప్పారు. ఆదివారం గ్రామంలో సమావేశమై నిరసన బాట పట్టాలని తీర్మానించుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామ సరిహద్దులో ఉన్న ఫార్మా కంపెనీల కాలుష్యం తమకు ప్రాణాంతకంగా మారిందని, ఇప్పుడు మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే జీవించే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కంపెనీని రద్దు చేయాలని కోరారు.