ఐదేళ్లలో ఫార్మా ఎగుమతులు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్

ఐదేళ్లలో ఫార్మా ఎగుమతులు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్

న్యూఢిల్లీ: ఇండియా నుంచి ఫార్మా ఎగుమతులు ఇంకో ఐదేళ్లలో రెండింతలు పెరుగుతాయని బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్ వెల్లడించింది.  ఐదేళ్లలో  ఫార్మా ఎగుమతులు 65 బిలియన్ డాలర్ల (రూ.5.65 లక్షల కోట్ల)కు, 2047 నాటికి 350 బిలియన్ డాలర్ల (రూ.30.45 లక్షల కోట్ల) కు  చేరుకుంటాయని  అంచనా వేసింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జనరిక్ మందులు సప్లయ్ చేయడంలో ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దొరికే ప్రతీ ఐదు జనరిక్ మందుల్లో ఒకటి మన దేశంలోనే తయారవుతోంది. మొత్తం  ఫార్మా ఎగుమతులు పరిగణనలోకి తీసుకుంటే   ఇండియా 11వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది.

కొత్త ప్రొడక్ట్​లను తీసుకురావడంతో పాటు, భిన్నమైన మందులను డెవలప్ చేయడం ద్వారా ఫార్మా ఎగుమతుల్లో ఇండియా ర్యాంక్ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5 కి చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్ పేర్కొంది. స్పెషాలిటీ జనరిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బయోసిమిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఇన్నోవేటివ్ ప్రొడక్టులను డెవలప్ చేయాలని తెలిపింది.  ఇండియన్ ఫార్మాస్యూటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలయన్స్ (ఐపీఏ), ఇండియన్ డ్రగ్స్ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (ఐడీఎంఏ)తో కలిసి తాజా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  విడుదల చేసింది. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని, మరిన్ని దేశాలకు ఎగుమతులు పెంచాలని సలహా ఇచ్చింది.