సంగారెడ్డిలోని అమీన్​పూర్​లో ఫార్మా హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌

సంగారెడ్డిలోని అమీన్​పూర్​లో ఫార్మా హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌
  • ఏర్పాటు చేయనున్న పల్సస్ గ్రూప్  

హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన పల్సస్​ గ్రూప్  రూ.300 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డిలోని అమీన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఏఐ- ఆధారిత ఫార్మా హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ఆరోగ్య సంరక్షణ,  ఐటీలకు మేలు చేస్తుంది.  ఈ హబ్​ వల్ల 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పల్సస్ ​ తెలిపింది. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైన ఇండియన్ ఫార్మా కాంగ్రెస్​లో డాక్టర్ శ్రీనుబాబు గేదెల ప్రాజెక్ట్ వివరాలను ప్రకటించారు. డ్రగ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం,  రోగి ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకొని దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇది భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో తెలంగాణను ముందంజలో ఉంచుతుందని అన్నారు. 

పరిశోధన,  అభివృద్ధి నుంచి హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ డెలివరీ వరకు ఫార్మాలోని అన్నింటినీ మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తామని శ్రీనుబాబు వివరించారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం.  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక మద్దతు లభిస్తుందని అన్నారు. బల్క్​డ్రగ్​ఉత్పత్తిలో హైదరాబాద్​ ఫార్మా వాటా 40శాతానికిపైగా ఉందని శ్రీనుబాబు చెప్పారు.