
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో సోమవారం ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్ర’ అనే అంశంపై సింపోసియాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా హెటిరో డ్రగ్స్ సీడీఎంఏ గ్లోబల్ హెడ్ డాక్టర్ వై. శ్రీధర్ రెడ్డి, క్లినోసోల్ రీసెర్చ్ ఫౌండర్, సీఈఓ సీ.ఎఎస్. మజీబుద్ధీన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్స్ ఫార్మా సబ్జెక్టులపై పట్టు సాధించి కొత్త ఆవిష్కరణలు కనిపెట్టాలని సూచించారు. క్లినికల్ డేటా సైన్స్, ఏఐ అనలిటిక్స్, రంగాలలో ఫార్మాసిస్ట్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. శివకుమార్, ఆర్గనైజర్ డాక్టర్ హైమ, డాక్టర్ శ్రీకాంత్, స్వప్నిక తదితరులు పాల్గొన్నారు.