ఫార్మసీ కాలేజీలు తగ్గినయ్

ఫార్మసీ కాలేజీలు తగ్గినయ్

46 బీఫార్మసీ, 46 ఎంఫార్మసీ కాలేజీలు ఏఐసీటీఈ అప్రూవ్ తీసుకోలె
16 బీటెక్, 24 ఎంటెక్ కాలేజీలు కూడా..

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎటుపోయినా, ఫార్మసీకి ఫుల్ డిమాండ్ ఉంటుందనే వాదన కొన్నేండ్లనుంచి వినిపిస్తోంది. కానీ ఇదంతా తప్పని అధికారిక లెక్కలు చూస్తే స్పష్టమవుతోంది. ఐదారేండ్లుగా ఏటా ఫార్మసీ కాలేజీలు, సీట్లు తగ్గుతూనే ఉన్నాయి. ఇంజనీరింగ్ కు
సంబంధించి ఎప్పటిలాగే ఈసారి కూడా కాలేజీలు, సీట్లు తగ్గాయి. ఫార్మసీ కాలేజీలతోపాటు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఏఐసీటీఈ గుర్తింపు తీసుకోలేదు. దీంతో 2020–21లో సీట్లకు భారీగా కోత పడింది. తగ్గిపోతున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు రాష్ట్రంలో 2019–20లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 628 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా.. తదితర కాలేజీలుండగా, వాటిలో 2,51,112 సీట్లకు ఏఐసీటీఈ అనుమతించింది. దీంట్లో 1,45,990 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2020–21లో మొత్తం 562 కాజీలకు, 2,31,737 సీట్లకు ఏఐసీటీఈ అప్రూవ్ చేసింది. తగ్గిన వాటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలే ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో 2020–21కి గానూ 81 బీఫార్మసీ కాలేజీలకు ఏఐసీటీఈ అప్రూవ్ ఇచ్చింది. వీటిలో 78 ప్రైవేటు కాలేజీలు, మూడు సర్కారీ కాలేజీలున్నాయి. గతేడాది 124 ప్రైవేటు కాలేజీలుండగా, ఈసారి ఏకంగా 46 కాలేజీలు ఏఐసీటీఈకి అప్లై చేసుకోలేదని తెలుస్తోంది. ఇక 2019–20లో 121 ప్రైవేటు ఎంఫార్మసీ కాలేజీలుండగా, ఈసారి 75 కాలేజీలకే పర్మిషన్ లభించింది. 46 కాలేజీలు ఏఐసీటీఈకి అప్లై చేసుకోలేదని తెలుస్తోంది. దీంతో బీఫార్మసీలో 3,752, ఎంఫార్మసీలో 3,386 సీట్లను ఏఐసీటీఈ తగ్గించింది.

24 ఎంటెక్ కాలేజీలు తగ్గాయి..
ఇంజనీరింగ్ కాలేజీలు ఈఏడాదీ తగ్గాయి. 2019–20లో 216 బీటెక్ కాలేజీలుండగా, వీటిలో 202 ప్రైవేటు, 14 సర్కారు కాలేజీలున్నాయి. ఈ ఏడాది 201 కాలేజీలకు తగ్గాయి. సర్కారు కాలేజీ ఒకటి పెరగ్గా,16 ప్రైవేటు కాలేజీలు తగ్గాయి. ఎంటెక్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. 2019–20లో 163 కాలేజీలుండగా, వీటిలో150 ప్రైవేటు, 13 సర్కారు కాలేజీలున్నాయి. ఈ ఏడాది 24 ప్రైవేటు ఎంటెక్ కాలేజీలు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందలేదు.

For More News..

ఇంటర్ సిలబస్ లో 30% కోత

కరోనా పేషంట్ బతికుండగానే చనిపోయాడంటూ..

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!