ఏజెన్సీ ఏరియాల్లో .. వాగులు, వంకలు దాటివెళ్లి వైద్య సేవలు

ఏజెన్సీ ఏరియాల్లో .. వాగులు, వంకలు దాటివెళ్లి  వైద్య సేవలు

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు:  వర్షాకాలమొస్తే.. ఏజెన్సీ ఏరియాల్లో వాగులు, వంకలు, పొంగిపొర్లుతుంటాయి. వైద్య సిబ్బంది వాటిని లెక్కచేయకుండా దాటి వెళ్లి సేవలు అందిస్తుంటారు.  ములుగు జిల్లా వెంకటాపూర్ పీహెచ్ సీ డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బందితో బుధవారం గుత్తి కోయగూడేనికి ట్రాక్టర్ పై వెళ్లి వైద్య సేవలు అందించారు.  మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని తొర్రిచింతలపాడు గుత్తి కోయగూడేంలోని ప్రజలకు వైద్య సేవలు అందించిన అనంతరం డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, గుత్తి కోయలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని.. లేదంటే మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయని అవగాహన కల్పించారు. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే.. వెంటనే ఆరోగ్య కార్యకర్తలను,  పీహెచ్ సీకి వచ్చి టెస్ట్ లు చేయించుకుని వైద్య సేవలు పొందాలని సూచించారు.  ఇంటింటా ఫీవర్ సర్వే చేసి అవసరమైన వారి బ్లాడ్ శాంపిల్స్ తీసుకుని మెడిసిన్ అందజేశారు. పీహెచ్ఎన్ఓ శోభహెల్త్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.