మాజీ వీసీ, రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి

మాజీ వీసీ, రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి

హసన్ పర్తి, వెలుగు : నిబంధనలను విరుద్ధంగా పీహెచ్ డీ సీట్లను భర్తీ చేసిన మాజీ వీసీ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు, ఇంజినీరింగ్ డీన్ మంచాల సదానందంపై క్రిమినల్ కేస్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, పీహెచ్​డీ ఆశావాహ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీహెచ్ డీ సీట్ల భర్తీపై కేయూ రిజిస్టర్ తో  విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. అనంతరం రిజిస్ట్రార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ క్యాటగిరి-1లోనే కాకుండా అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలన్నారు. రెండో లిస్ట్ ప్రకటించాలని ఇన్​చార్జి కరుణ ఆదేశించినప్పటికీ డీన్లు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండీ పాషా, మట్టెడ కుమార్, మందా భాస్కర్, మోతె రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.