CSK vs RCB: స్పిన్ ఆడడంలో అతడిని మించినోడు లేడు: ఆర్సీబీ స్టార్ ఓపెనర్

CSK vs RCB: స్పిన్ ఆడడంలో అతడిని మించినోడు లేడు: ఆర్సీబీ స్టార్ ఓపెనర్

ప్రపంచ క్రికెట్ లో స్పిన్ ఆడగలిగే సామర్ధ్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఆడేసే  బ్యాటర్లు స్పిన్ కు మాత్రం తలవంచుతారు. కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్ తో పోల్చితే స్పిన్ అద్భుతంగా ఆడతారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో హెన్రిచ్ క్లాసన్, నికోలస్ పూరన్, శివమ్ దూబే, రజత్ పటిదార్ లాంటి ఆటగాళ్లు స్పిన్ అలవోకగా ఆడేస్తారు. ప్రపంచ టాప్ స్పిన్నర్ అయినా వీరు అలవోకగా ఆడేస్తారనే పేరుంది. తాజాగా ప్రపంచ క్రికెట్ లో స్పిన్ ఎవరు బాగా ఆడతారో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పిల్ సాల్ట్ చెప్పాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ పై శుక్రవారం (మార్చి 28) జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. చెపాక్ లో 2008 తర్వాత ఆర్సీబీ తొలి సారి చెన్నైపై గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ స్టార్ ఓపెనర్ పిల్ సాల్ట్ తమ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ గురించి మాట్లాడాడు. " పటిదార్ కెప్టెన్సీ అద్భుతం. అతనిలా స్పిన్ ఆడే ఆటగాడిని నేను ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు చూడలేదు. ఒత్తిడిలోనూ చాలా ప్రశాంతంగా ఉండగలదు. సమయానికి తగ్గట్టుగా తెలివిని ప్రదర్శిస్తాడు". అని సాల్ట్ అన్నాడు. ఈ మ్యాచ్ లో పటిదార్ 32 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఆర్సీబీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

Also Read :- న్యూజిలాండ్ తరపున పాకిస్థాన్ క్రికెటర్ వరల్డ్ రికార్డ్!

ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగిన రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు.. ఐపీఎల్‌‌లో రెండో విజయాన్ని సాధించింది. కెప్టెన్‌‌ రజత్‌‌ పటిదార్‌‌ (32 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 51), ఫిల్‌‌ సాల్ట్‌‌ (32), విరాట్‌‌ కోహ్లీ (31) రాణించడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీ 50 రన్స్‌‌ తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 196/7 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 146/8 స్కోరుకే పరిమితమైంది. రచిన్‌‌ రవీంద్ర (41) టాప్‌‌ స్కోరర్‌‌. ధోనీ (30 నాటౌట్‌‌), జడేజా (25) ఫర్వాలేదనిపించారు. రజత్‌‌ పటిదార్ కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.