WI vs ENG 2024: మెగా ఆక్షన్‌కు ముందు జాక్ పాట్ ఛాన్స్: ఇంగ్లాండ్ ప్లేయర్ మెరుపు సెంచరీ

WI vs ENG 2024: మెగా ఆక్షన్‌కు ముందు జాక్ పాట్ ఛాన్స్: ఇంగ్లాండ్ ప్లేయర్ మెరుపు సెంచరీ

ప్రస్తుత టీ20 క్రికెట్ లో సాల్ట్ చెలరేగి ఆడుతున్నాడు. శనివారం (నవంబర్ 9) అర్ధ రాత్రి వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు. 53 బంతుల్లో సెంచరీ పూర్తి  చేసుకున్న ఈ ఇంగ్లాండ్ ఓపెనర్.. 54 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సాల్ట్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు.. 6 సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్ టీ20 కెరీర్ లో ఇది మూడో సెంచరీ. అంతకముందు రెండు సెంచరీలు కూడా ఇంగ్లాండ్ పైనే కొట్టాడు.        

2024 ప్రారంభంలో వెస్టిండీస్ తో 5టీ20 ల సిరీస్ లో భాగంగా మూడో టీ20లో 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సాల్ట్.. నాలుగో టీ20 లో 57 బంతుల్లో 119 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. దీంతో టీ20 క్రికెట్ లో  మూడు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్  తో సాల్ట్ కు ఐపీఎల్ లో మంచి డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24,25 తేదీల్లో జరగనుంది. సాల్ట్ ప్రస్తుతం సూపర్ ఉండడంతో పాటు.. 2024 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ తరపున అద్భుతంగా  రాణించాడు.

ఇటీవలే కేకేఆర్ అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. దీంతో అతనికి భారీ ధర పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సాల్ట్ సెంచరీతో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు  చేసింది. పూరన్(38), రస్సెల్ (30), షెపర్డ్ (35) రాణించారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. ఓపెనర్ సాల్ట్ (103) సెంచరీతో పాటు బెతేల్ (58) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు.