ఫిలాటెక్స్​కు రూ.293 కోట్ల విలువైన ఆర్డర్​

ఫిలాటెక్స్​కు రూ.293 కోట్ల విలువైన ఆర్డర్​

హైదరాబాద్​, వెలుగు:  సాక్స్,  కాటన్ ఉత్పత్తుల ఎగుమతిదారు.. హైదరాబాద్​కు చెందిన ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ తెలుపు మార్బుల్ సరఫరా కోసం దాని అనుబంధ సంస్థ 35 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 293 కోట్లు) విలువైన ఎగుమతి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందినట్లు తెలిపింది.

కంపెనీకి ఇది తొలి ఎగుమతి ఆర్డర్. యూరప్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, ఆఫ్రికాలో రాబోయే 54 ఆసుపత్రుల కోసం హాస్పిటల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థ బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోరా వెంచర్స్ లిమిటెడ్ నుంచి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్నట్లు  ఫిలాటెక్స్ మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 15న జరిగిన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా-ఆర్డినరీ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్ల సమావేశంలో 5:1 స్టాక్ స్ప్లిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనను ఆమోదించారు.