DC vs RCB: నాలుగు బంతుల్లో 25 పరుగులు.. స్టార్క్‌ను చితక్కొట్టిన సాల్ట్

DC vs RCB: నాలుగు బంతుల్లో 25 పరుగులు.. స్టార్క్‌ను చితక్కొట్టిన సాల్ట్

గురువారం (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా  మూడో ఓవర్లో మిచెల్ స్టార్క్ కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్ లో ఏకంగా తొలి నాలుగు బంతుల్లో 25 పరులు రావడం విశేషం. తొలి బంతిని సిక్సర్ కొట్టిన సాల్ట్.. ఆ తర్వాత వరుసగా మూడు ఫోర్లు బాదాడు. నాలుగో బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ రూపంలో వచ్చిన బంతిని సిక్సర్ బాదేశాడు. దీంతో తొలి నాలుగు బంతుల్లోనే 25 పరుగులు వచ్చాయి.  

చివరి బంతికి ఫోర్ రావడంతో ఈ ఒక్క ఓవర్ లోనే ఆర్సీబీ 30 పరుగులు రాబట్టింది. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి సాల్ట్.. 17 బంతుల్లో 37 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. సాల్ట్ విధ్వంసంతో బెంగళూరు పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. పడికల్ 1 పరుగే చేసి విఫలమయ్యాడు. ఇక పవర్ ప్లే తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి కోహ్లీ (24) కూడా ఔటయ్యాడు. దీంతో స్వల్ప వ్యవధిలో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో ఆర్సీబీ 89 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ పటిదార్ (14), లివింగ్ స్టోన్ (3) ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.