Philips layoffs : ఫిలిప్స్లో వేల మంది ఉద్యోగుల తొలగింపు

Philips  layoffs : ఫిలిప్స్లో వేల మంది ఉద్యోగుల తొలగింపు

ఆర్థిక మాంద్యం భయాలతో అంతర్జాతీయ కంపెనీల్లో లేఆఫ్ ల పర్వం కొనసాగుతోంది. వరుసగా ఒక్కో కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. మాంద్యం భయాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో కంపెనీలన్నీ ఉద్యోగుల్ని సాగనంపేందుకు కారణమవుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో చేరిన ఫిలిప్స్ కంపెనీ 6 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన ‘స్లీప్ రెస్పిరేటర్స్’లో లోపం వల్ల భారీ సంఖ్యలో వాటిని రీకాల్ చేసింది. దీంతో ఫిలిప్స్ కంపెనీకి భారీ నష్టం వచ్చింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకే ఫిలిప్స్ 6వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. 

‘కంపెనీ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం బాధాకరమే అయినా సంస్థ ప్రయోజనాల కోసం తప్పడం లేదు. 2025 నాటికి మరికొన్ని లేఆఫ్ లు ఉంటాయి’ అని ఫిలిప్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకోబ్స్ అన్నాడు. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన సమయంలోనూ కంపెనీ  4వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది.