మంచంపై నుంచి లేస్తూనే జనాలు.. స్మార్ట్ ఫోన్ ఎక్కడుందా.. అని వెతుక్కుంటున్నారు. కొంతమందైతే రెండు, మూడు ఫోన్లను మెయిన్‌టెన్ చేస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కు ఒకటి.. ఆఫీసు పనులకు ఒకటి.. స్నేహితులకు.. ఇతర పనులకు ఒకటి ..ఇలా ఎవరి అవసరాలను బట్టి వారు రెండు, మూడు ఫోనులు వాడుతుంటారు. దాదాపు ఎవరు ఎన్ని ఫోన్లు వాడినా స్మార్ట్ ఫోన్లు.. యాపిల్ ఫోన్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా ఐ ఫోన్ 15 సిరీస్ ఈ కామర్స్ సంస్థల్లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి.
యాపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో క్రేజ్ మామూలుగా లేదు. . ధర ఎంతైనా.. కొనేందుకు ఫోన్ ప్రియులు ఆలోచించడం లేదు. అప్పు చేసి మరీ కొనేస్తున్నారు. మరికొందరేమో ఈఎంఐ ఆప్షన్‌లలో కొనుక్కుంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఆఫర్లు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్‌లు ఐఫోన్లపై మంచి డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందిస్తాయేమో అని ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్ 15 పై అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. Apple గత సంవత్సరం సెప్టెంబర్ 2023లో iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనిలో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను జోడించింది. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు శుభవార్త వచ్చింది. ఐఫోన్ 15పై భారీ తగ్గింపులు ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. ఈ డీల్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ ధరకు ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ఫోన్ 128 జీబీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,999గా ఉంది. అయితే ఇప్పుడు ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ నేరుగా 9శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే ఎలాంటి అదనపు ఆఫర్ లేకుండా ఈ ఫోన్‌ను రూ.71,999కి కొనుగోలు చేయవచ్చు.
అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు నేరుగా రూ.4,000 తగ్గింపు వర్తిస్తుంది. అలాగే ICIC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్స్‌పై రూ. 4,000 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపిఐ ట్రాన్షక్షన్‌పై రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.62000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో దీన్ని కేవలం రూ.5,999లకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే పాత ఫోన్ మంచి కండీషన్ కలిగి ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్, డ్యామేజ్ ఉండకూడదు.
ఐఫోన్ 15 ఫీచర్లు
ఐఫోన్ 15ను అనేక ఫీచర్లతో కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 15 పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. iPhone 15లో A16 SoC చిప్ అమర్చబడింది. ఆపిల్ గత సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అయితే ప్రో మోడల్‌లు వేగవంతమైన, మెరుగైన A16 చిప్‌ను కలిగి ఉన్నాయి