ఫోన్ చేసి కర్నాటకకు పిలిపించి మోసం
ఏడాది క్రితం మోసగాళ్ల వలలో పడిన ఇద్దరు
ఇప్పుడు ట్రాప్ చేసి నిందితులను పట్టుకున్నరు
నారాయణపేట, వెలుగు: పొలంలో బంగారం దొరికిందని.. కిలో రూ. 10 లక్షలకే ఇస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నిందితుల చేతుల్లో ఇద్దరు మోసపోయారు. ప్రస్తుతం వారికి వచ్చినట్లుగానే మరొకరికి ఫోన్‌రావడంతో పోలీసుల సాయంతో నిందితులను ట్రాప్చేశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని నంబర్‌నుంచి ఫోన్వచ్చింది. నా ఫ్రెండ్ మీ నంబర్ఇచ్చాడు.. మీతో సీక్రెట్‌గా మాట్లాడాలి.. విషయం ఎవరికీ చెప్పవద్దంటూ మాట తీసుకున్నాడు. పొలం దున్నేటపుడు తనకు భారీగా బంగారం దొరికిందని, అర్జంట్‌గా డబ్బులు కావాలి. తక్కువ ధరకే బంగారం ఇస్తానంటూ చెప్పాడు. ముందు శాంపిల్చెక్చేసుకొమ్మని, నిజమైన బంగారం అని తేలాకే డబ్బులిచ్చి తీసుకెళ్లమని అన్నాడు. తనది కర్నాటక రాష్ట్రం శివమొగ్గ అంటూ అడ్రస్చెప్పాడు. దాంతో కర్నాటక వెళ్లిన నారాయణపేట వాసి తాను అక్కడికి వచ్చినట్లు ఆ వ్యక్తికి ఫోన్‌చేసి చెప్పాడు. దాంతో నిందితులు అతడికి చెక్చేసుకోవాలంటూ 5 గ్రాముల బంగారం ఇచ్చారు. నమ్మకం కలిగితే కిలో బంగారం రూ.10 లక్షలకు ఇస్తామన్నారు. బంగారంతో పేటకు వచ్చిన వ్యక్తి దుకాణంలో చెక్చేయించగా ఒరిజినల్అని చెప్పారు. ముందుగా కిలో బంగారం కావాలని చెప్పి కర్నాటక వ్యక్తికి ఫోన్ చేయగా ఫలానా టైంకి రమ్మన్నారు. పేట వ్యక్తి ఇంకో ఫ్రెండ్‌తో కలిసి రూ.10 లక్షలు తీసుకుని శివమొగ్గకు వెళ్లారు. ఫోన్ చేసి అక్కడికి వచ్చామని చెప్పగా ఓ అడ్రస్‌కు రమ్మన్నారు. అక్కడ అనుచరులతో మాటువేసి వారిని కొట్టి రూ. 10 లక్షలు లాక్కున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి పారిపోయారు. తన్నులు తిన్న పేటవాసులు చేసేది లేక తిరిగొచ్చారు. మోసపోయిన విషయం ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకున్నారు.
ఏడాది తర్వాత మరొకరికి ఫోన్
నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ఫోన్కాల్వచ్చింది. గత ఏడాది మోసపోయిన వ్యక్తి, ఇతను ఫ్రెండ్స్. దాంతో నిందితుల ప్లాన్అర్థం చేసుకున్న వీరిద్దరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్నాటక బంగారం గ్యాంగ్‌తో ఫోన్లో టచ్‌లోకి వెళ్లారు. శాంపిల్తీసుకునేందుకు కర్నాటక వస్తున్నట్లు చెప్పారు. అక్కడ శాంపిల్తీసుకుంటున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా పేటకు తీసుకువచ్చారు. బంగారం పేరుతో మోసం చేసేవారిని పట్టుకున్న విషయం వాస్తవమేనని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని ఎస్సై చంద్రమోహన్ చెప్పారు.
For More News..