హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దసరా పండుగకు ముందే అక్టోబర్ 9వ తేదీన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందిజేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సెలక్షన్ ప్రాసెస్ ను పూర్తి చేశారు. ఈ మేరకు డీఎస్సీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల నుండి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ (2024, అక్టోబర్ 8) ఫోన్ కాల్స్ చేసిన అధికారులు.. 2024, అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీచర్ల నియామక ప్రక్రియ ఉందని.. 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటెండ్ కావాలని సూచించారు.
ALSO READ | Good News :అక్టోబర్ 9న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు : సీఎం రేవంత్
రేపు ఉదయం 9 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్ల ఆఫీసుల నుండి డీఎస్సీలో ఎంపిక అభ్యర్థులను ప్రత్యేక బస్సుల ద్వారా ఎల్బీ స్టేడియానికి తీసుకురావడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందివ్వనున్నారు. కాగా, 11,063 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల డీఎస్సీ తుది ఫలితాలు వెలువడగా.. కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 9వ తేదీన అపాయిట్మెంట్ లెటర్స్ అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగా రేపు సెలెక్టడ్ క్యాండిడేట్స్ కు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.