కేవలం రూ.2వేల 500 ఖర్చు..ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఫోన్ డేటా..నకిలీ కాల్ సెంటర్..నకిలీ ఎల్ఐసీ పాలసీలు,లోన్లు ఇప్పిస్తామని భారీ మోసం.. వేల కోట్లు దండుకున్నారు. ఢిల్లీ సమీపంలో నోయిడాలో వెలుగు చూసిన భారీ స్కాంలో తొమ్మిది మంది మహిళలతో సహా 11 మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. వివరాల్లోకి వెళితే..
నోయిడాలోని సెక్టర్ 51 మార్కెట్ లోని ఓ భవనంలో ఏడాది కాలం కాల్ సెంటర్ పేరుతో రుణాలు, బీమా పాలసీలపై అధిక ఆదాయం ఎర వేసి వందలాది మందిని మోసం చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడంలో ఈ స్కాం బయటపడింది. ఈ ఆన్ లైన్ మోసానికి సూత్రధారులైన ఆశీష్,జితేంద్ర లు తొమ్మిది మంది మహిళలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ లుగా చేర్చుకొని వారి ద్వారా బీమా పాలసీలు,లోన్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడినట్లు తేలింది. నకిలీ ఆధార్ కార్డుల ద్వారా ఈ ముఠా సిమ్ కార్టును కొనుగోలు చేసి భారీ ఆన్ లైన్ మోసాలకు పాల్పడింది. కమిషన్ బేసిక్ పై ఈ మహిళలను పనిచేయిస్తూ..అమయాకులను టార్గెట్ చేసేవారు.
అంతేకాదు వీరు ఉపయోగించే బ్యాంకు ఖాతాలు కూడా వీరి పేరున ఉండవు.. కర్నాటకలోని అరవింద్ అనే వ్యక్తి ఖాతాను నెలకు రూ. 1000 చొప్పున అద్దెకు తీసుకున్నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో స్కామ్ భాధితుల నుంచి డబ్బులు జమ చేసేవారు. ఆశిష్ , జితేంద్ర ఇద్దరూ నోయిడాలోని ఈ డబ్బును డ్రా చేసుకునే వారు.
ఏడాది కాలంగా జరుగుతున్న ఈ ఆన్ లైన్ స్కాం గుట్టు.. పోలీసుల రైడింగ్ దొరికిన బ్లాక్ డైరీద్వారా బయటపడింది. ఈ స్కాంలో సంపాదించిన కోట్లాది రూపాయల వివరాలు ఇందులో ఉన్నాయి. నోయిడాలోని సెక్టార్ 49 పోలీసులు, క్రైమ్ రెస్పాన్స్ టీమ్(సీఆర్టీ) కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో ఈ భారీ స్కామ్ వెలుగుచూసింది.
2019లో ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేసి బయటికి వచ్చిన ఆశీష్, జితేంద్ర ఆన్ లైన్ అక్రమాలకు పాల్పడటం మొదలు పెట్టారు. కేవలం రూ. 2500 చెల్లించి ఇండియా మార్ట్ నుంచి 1000 మంది వ్యక్తుల డేటాను కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కాల్ చేసి బీమా అందిస్తామనే నెపంతో వారిని మోసం చేశారు.
అరెస్టయిన వారిలో కీలక నిందితులు ఆశీష్ కుమార్ అలియాస్ అమిత్, జితేంద్ర వర్మ అలియాస్ అభిషేక్ లుగా పోలీసులు గుర్తించారు. అరెస్టయి తొమ్మిది మంది మహిళల్లో నిషా అలియాస్ స్నేహ, రేజు అలియాస్ దివ్యవ, లవ్లీ యాదవ్ అలియాస్ శ్వేత, పూనమ్ అలియాస్ పూజ, ఆర్తికుమారి అలియాస్ అనన్య, కాజల్ కుమారి అలియాస్ స్పూర్తి, సరిత అలియాస్ సుమన్, బబితా పటేల్ అలియాస్ మహి, గరిమా చౌహాన్ అలియాస్ సోనియా గుర్తించారు.
కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం ఈ కేసులో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.