ఫోన్​ పేలుడు ఘటన.. బాలిక మృతిపై స్పందించిన షావోమీ

కేరళలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆదిత్యశ్రీ ఏప్రిల్​ 25 న ఫోన్​ పేలి మృతి చెందిన విషయం విదితమే. కాగా పేలిన మొబైల్ రెడ్​మీనే అని పలు నివేదికలు వెల్లడించాయి.  బ్యాటరీ ఓవర్​ హీట్​ కావడమే పేలుడుకు కారణమని అధికారులు తెలిపారు. కాగా ఈ విషాద ఘటనపై రెడ్​మీ మాతృసంస్థ షావోమీ స్పందించింది. 

కుటుంబసభ్యులను ఆదుకుంటాం..

ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి అధికారులతో కలిసి తాము పని చేస్తామని షావోమీ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ల భద్రత తమకు చాలా ముఖ్యమని, అలాంటి విషయాలను సీరియస్​గా తీసుకుంటామని కంపెనీ స్పష్టం చేసింది. వారి కుటుంబానికి అండగా నిలుస్తామని వెల్లడించింది. దర్యాప్తు చేసే అధికారులకు సహకరిస్తామని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.