
బషీర్బాగ్, వెలుగు: ఆర్టీసీ బస్సులో దుండగులు ఫోన్ కొట్టేసి, అకౌంట్నుంచి డబ్బులు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన 45 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగిని ఇటీవల తార్నాక నుంచి కాచిగూడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. జర్నీలో తన మొబైల్ ను పోగొట్టుకోగా కాచిగూడ పీఎస్లో ఫిర్యాదు చేసింది.
కాసేపటికే ఆమె ఎస్బీఐ అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయగా రూ.1.04 లక్షలు డెబిట్ అయ్యాయి. బాధిత మహిళ ఆన్లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు.