జనవరి 9 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దు

జనవరి 9 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దు

ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని పేర్కొంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందే హైకోర్టు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను సోమవారం పొడిగించింది. 

రాజకీయ కక్షతోనే చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్ లో తనపై తప్పుడు కేసు నమోదైందని, దీనిని కొట్టేయాలని హరీశ్ రావు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు డిసెంబర్ 30 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దని పేర్కొంది. ఈ పిటిషన్ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణను జనవరి 9కి వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్టు చేయరాదన్న గత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వివరించారు.