హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఐ న్యూస్ మాజీ ఎండీ ఎ. శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.ఆయన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషనర్‌కు కింది కోర్టు బెయిల్ ఇచ్చేందుకు ఇటీవల నిరాకరించింది. పిటిషనర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండగా, రెండ్రోజుల కింద పిటిషనర్ పాస్‌పోర్టు రద్దయ్యింది. దీంతో పిటిషనర్ ఇండియాకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూశ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆయన పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.