ఫోన్ ట్యాపింగ్ కేసు..తిరుపతన్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసు..తిరుపతన్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు తిరుపతన్నకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న వేషిన పిటిషన్ మంగళవారం ( అక్టోబర్ 1) హైకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు కీలక దశలో ఉందని బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 

పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు తిరుపతన్నకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్న హైకోర్టు.. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని చెప్పింది. ఫోరెన్సిక్ ల్యాబరేటరి నివేదిక ప్రకారం..దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.