- పోలీసులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్‌ట్యాపింగ్ కేసులో 2వ నిందితుడైన దుగ్యాల ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. తన బెయిల్ ను అడ్డుకోవడానికే హడావుడిగా దర్యాప్తు సంస్థ అభియోగ పత్రం దాఖలు చేసిందని ప్రణీత్‌రావు పిటిషన్ లో ఆరోపించారు. దీనిని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు ఇచ్చారు. విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.