= ఏసీబీ కోర్టులోని ఓ జడ్జి సహా ఓ మహిళా జడ్జి ఇన్ఫర్మేషన్
= ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో కీలక అంశాలు
= ఖమ్మం జిల్లాకు చెందిన జడ్జి, ఆయన భార్య ఫోన్ ట్యాప్
= 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 415 ఫోన్లు ట్యాప్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు కంప్యూటర్ లో 18 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫోరెన్సిక్ అధికారులు సిట్ కు నివేదిక అందజేశారు. వీరితో పాటు నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ జడ్జితో పాటు మరో మహిళా న్యాయమూర్తి సమాచారం కూడా ఉందని తెలుస్తోంది.
నిందితుడు భుజంగరావు కంప్యూటర్ లో వివిధ రాజకీయ పార్టీల సమాచారం ఉంది. ఇటీవల హైకోర్టు నుంచి బదిలీపై, ప్రమోషన్ పై వెళ్లిన జడ్జీల ఇన్ఫర్మేషన్ కూడా ఉండటం గమనార్హం. వీటి ఆధారంగా నిందితులపై బీఎన్ఎస్ 85 కింద కేసు నమోదు చేసి వాళ్ల స్థిర, చరాస్తులన్నీ జప్తు చేసే అవకాశం ఉందని సమాచారం. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 415 ఫోన్లు ట్యాప్ అయినట్టు ఫోరెన్సిక్ సిట్ కు ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది.