Road Accidents: డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుతున్నారా..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే

మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవంగ్ చేస్తున్నారా..అయితే ఈ విషయం మీకు తప్పక తెలియాల్సిందే. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై సర్వే నిర్వహించిన ఢిల్లీ ఐఐటీ లోని ట్రాన్స్ పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్.. సంచలన విషయాలను బయటపెట్టింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లను ఉపయోగిం చ డం వల్ల ఎంత ప్రాణనష్టం జరుగుతుందో తెలిపింది.

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల రెడ్ లైట్ జంపింగ్ కంటే ఎక్కువ మరణాలు సంభవించాయని తెలిపింది.  ట్రాఫిక్ ప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్లు, మరణాలపై ప్రభుత్వ డేటాను విశ్లేషించిన ఈ సంస్థ తన అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడించింది. 

మొబైల్ ఫోన్ వాడకం వల్ల 2021లో 1,040 మంది మరణించారని.. 2022లో ఆ సంఖ్య 1,132కి పెరిగిందని డేటా వెల్లడించింది. దీనికి విరుద్ధంగా రెడ్ లైట్ జంపింగ్ కారణంగా మరణాలు 2021లో 222 నుంచి 2022లో 271కి పెరిగాయి. 

ALSO READ | హర్యానాలో యాక్సిడెంట్..ఎనిమిది మంది మృతి

ట్రాఫిక్ ప్రమాదాలు, మరణాలపై మంగళవారం సెప్టెంబర్ 03, 2024న జరిగిన గ్లోబల్ కాన్ఫిరెన్స్ సేఫ్టీ 2024లో వెల్లడించిన ప్రభుత్వ డేటా ప్రకారం.. 2022లో రోడ్డు ప్రమాదాల వల్ల 61వేల 038 మంది చనిపోయారు. 2021లో 56వేల మంది చనిపోయారు.  ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణం అయితే 

 మొబైల్ ఫోన్ వాడకం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం కారణంగా మరణాలు 21 శాతం పెరిగాయని పరిశోధకులు గుర్తించారు.

2022లో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు:

వేగం: 45,928 మరణాలు
రాంగ్ సైడ్ డ్రైవింగ్: 3,544 మరణాలు
తాగి వాహనాలు నడపడం: 1,503 మరణాలు
మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్: 1,132 మరణాలు
రెడ్ లైట్ జంపింగ్: 271 మరణాలు
ఇతర కారణాలు: 8,660 మరణాలు