
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే గ్రూప్ 2023–-24 ఆర్థిక సంవత్సరానికి (ఈసాప్ ఖర్చులను మినహాయించి) రూ. 197 కోట్ల నికర లాభాన్ని (స్టాండెలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.738 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 5,064 కోట్ల ఆదాయం రాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,914 కోట్లు వచ్చాయి.
పేమెంట్స్ బిజినెస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 710 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని (ఈసాప్ ఖర్చులను మినహాయించి) సంపాదించింది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో రూ. 194 కోట్ల నష్టం వచ్చింది.