డిజిటల్ చెల్లింపుల గురించి మనందిరికి తెలిసిందే.. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరూ దాదాపు UPI సేవల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు UPI సేవలు..Google Pay, Phone Pe, PayTM, BHIM వంటి వివిధ యాప్ ల ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎటువంటి లిమిట్ లేకుండా ఈ యాప్ ల ద్వారా లావాదేవీలు చేస్తు న్నా రు అయితే ఈ యాప్ ల ద్వారా నగదు బదిలీపై పరిమితులు విధించన్నట్టు తెలుస్తోంది.
మన దేశంలోGoogle Pay, PhonePe, PayTM , BHIM వంటి వివిధ యాప్ లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సిస్టమ్ కు కనెక్ట్ చేయడం ద్వారా UPI సేవలు అందిస్తున్నారు.
UPI డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), యాప్ ల వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేయడానికి ప్రతి పాదిత డిసెంబర్ 31 గడువును అమలు చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం వాల్యూమ్ క్యాప్ లేదు ..Google Pay,PhonePe మార్కెట్‌లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి.
2022లో ఈ యాప్ ల ద్వారా యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు NPCI 30 శాతం మార్కెట్ క్యాప్ ను ప్రతిపాదించింది. ఈ యాప్ ల మార్కెట్ వాటాను పరి మితం చేయడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది. అయితే మార్కెట్ క్యాప్ లు అమలు చేయడానికి గడువు 2023 డిసెంబర్ లో ముగిసినా..అది నెరవేరలేదు. ఈ విష యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్కెట్ క్యాప్ ను అమలు చేయడానికి సర్క్యూలర్ జారీ చేసే అవకాశం ఉంది.
2024 ఏప్రిల్ లో PhonePe వ్యక్తి నుంచి వ్యాపారికి , వ్యక్తి నుంచి వ్యక్తికి లావాదేవీలలో దాదాపు 49 శాతం వాటాతో UPI మార్కెట్ నడిపించింది.2020 నుంచి UPI లావాదే వీ లలో ఈ కంపెనీ నెంబర్ వన్ గా ఉంది. మరోవైపు GooglePay 38 శాతం మార్కెట్ వాటాను సాధించింది. అయితే యూపీఐ ఎకో సిస్టమ్ లో Paytm మాత్రం ఏ్రప్రిల్ నెలలో 8.4 శాతానాకి మార్కెట్ వాటా పడిపోయింది.