న్యూఢిల్లీ: ఫోన్‌పే ద్వారా ఇక నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా కట్టొచ్చు. ‘ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్’ ఫీచర్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ట్యాక్స్‌పేయర్లు సెల్ఫ్ అసెస్‌మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఫోన్‌పే యాప్‌తో చెల్లించొచ్చు. యూపీఐ లేదా క్రెడిట్‌కార్డ్ పేమెంట్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడానికి బిజినెస్ టూ బిజినెస్ ప్లాట్‌ఫామ్ పేమేట్‌తో ఫోన్‌పే టై అప్ అయ్యింది.
ALSO READ :ఆహార వస్తువుల ఉత్పత్తి, రేట్లు గమనిస్తున్నాం : కైలాష్ చౌదరి
‘సాధారణంగా ట్యాక్స్ కట్టడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. కష్టం కూడా. ట్యాక్స్ పేయర్లు తమ ట్యాక్స్‌ను ఈజీగా, సురక్షితంగా కట్టుకోవడానికి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చాం’ అని ఫోన్‌పే హెడ్ (బిల్ పేమెంట్స్) నిహారిక సైగల్ అన్నారు. ట్యాక్స్ పేమెంట్స్‌పై (క్రెడిట్ కార్డుతో కడితే) 45 రోజుల వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, రివార్డ్ పాయింట్లు కూడా పొందొచ్చని ఫోన్‌పే పేర్కొంది. పేమెంట్ పూర్తయితే ఒక్క వర్కింగ్ డేలో యూజర్లకు యునిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ (యూటీఆర్) ఇష్యూ అవుతుంది. చలానా మాత్రం రెండు వర్కింగ్ డేస్‌లో ఇష్యూ అవుతుంది.