ఇక నుంచి ఫొటోలో బ్యాక్ గ్రౌండ్ తీసేయమని లేదా ఫొటోకు బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేయమని ఏ ఫొటో ఎడిటర్ దగ్గరకు వెళ్లక్కర్లేదు. ఒక ఫొటో అప్‌లోడ్ చేసి ఒక్క క్లిక్ చేస్తే చాలు ఫొటో షాప్ చేయాల్సిన పని లేకుండా అప్‌లోడ్ చేసిన ఫొటోకి బ్యాక్ గ్రౌండ్ ఎడిట్ అయిపోతుంది. గూగుల్ వాళ్లు తీసుకొచ్చిన ‘రిమూవ్ బిజి (బ్యాక్ గ్రౌండ్)’లో ఇలా చేయొచ్చు. ఇదెలా పని చేస్తుందంటే గూగుల్‌లో ‘రిమూవ్ బిజి’ అని సెర్చ్ చేయాలి. వచ్చిన లింక్ ఓపెన్ చేశాక అందులో అప్‌లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది.
బ్యాక్ గ్రౌండ్ తీసేయాలనుకున్న ఫొటో అక్కడ కంటెంట్ అప్‌లోడ్ చేయగానే బ్యాక్ గ్రౌండ్ పోయి ఫొటో వస్తుంది. ఆ ఫొటోను కావాల్సిన క్లారిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు వాళ్లు ఇచ్చిన కస్టమైజేషన్ డిజైన్స్‌తో బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేయొచ్చు. కావాలంటే ఫొటో బ్యాక్ గ్రౌండ్స్ గూగుల్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసి యాడ్ చేయొచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా ఉంది.