మహాశివరాత్రి కోసం ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. వేములవాడ రాజన్న, కీసరగుట్ట, ఇందూరు నీలకంఠేశ్వర, కొమురెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వేములవాడలో మూడురోజుల జాతర సోమవారం మొదలైంది. మంగళవారం శివరాత్రి సందర్భంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.