గ్రూప్1 హాల్ టికెట్ పై ఫొటో తప్పనిసరి

గ్రూప్1 హాల్ టికెట్ పై ఫొటో తప్పనిసరి

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై లేటెస్ట్ ఫొటో తప్పనిసరి అతికించాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఫొటో లేకపోతే పరీక్షా కేంద్రంలోకి  అనుమతించబోరని వెల్లడించింది. మూడు నెలల లోపే దిగిన ఫొటో మాత్రమే అతికించాలని సూచించింది. ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనున్నది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పెట్టినట్టు తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చే సమయంలో తప్పనిసరిగా ఏదైనా ఒక  ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని కోరారు.