ఇదీ మన సిస్టం: ఒక పక్క వయోభారం.. మరో పక్క ఫైళ్ల భారం.. న్యాయం కోసం వృద్ధ దంపతుల పోరాటం..

ఇదీ మన సిస్టం: ఒక పక్క వయోభారం.. మరో పక్క ఫైళ్ల భారం.. న్యాయం కోసం వృద్ధ దంపతుల పోరాటం..

కోర్టు కేసులు.. ఈ మాట వింటేనే సామాన్యుడికి ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాప్యం, మన చట్టాల్లో ఉన్న లొసుగులే ఇందుకు కారణం. కోర్టు కేసుల కోసం ఆస్తులు అమ్ముకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే.. వీలైనంత వరకు సామాన్యులు కోర్టు కేసులకు దూరంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వృద్ధ దంపతుల పరిస్థితి గురించి తెలిస్తే.. మన న్యాయ వ్యవస్థ ఎలా ఉందో క్లియర్ గా తెలుస్తుంది. మహేశ్వర్ పేరి అనే ఓ సోషియల్ వర్కర్ తన ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ కధనం మనసును కలిచివేస్తుంది.

Also Read :- గూగుల్తో అదానీ గ్రూప్ బిజినెస్

కొన్ని సంవత్సరాల క్రితం పని మీద కోర్టుకు వెళ్లిన అతనికి కోర్టు ఆవరణలో కనిపించిన వృద్ధ దంపతుల గురించి చెప్పుకొచ్చారు సదరు సోషియల్ వర్కర్. కోర్టు ఆవరణలో వెయిట్ చేస్తున్న తనకు ఒక చెక్కబండిపై ఫైళ్లను మోస్తూ వృద్ధ దంపతులు కనిపించారని.. వాళ్ళు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడుస్తూ.. చెక్కబండిపై ఫైళ్లు మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం తనను కదిలించిందని అన్నారు. వారు మోస్తున్న ఫైళ్ల మోతను చూస్తుంటే ఎన్నేళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

 

 

సమాజాన్ని మార్చాలనుకునే యువతకు న్యాయశాస్త్రం బెస్ట్ ఆప్షన్ అని.. ఈ రంగంలో కేవలం చట్టాలనే కాకుండా సామాన్యుల జీవితాలను మార్చటానికి కేసుల స్కోప్ ఉంటుందని అన్నారు మహేశ్వర్. వృద్ధ దంపతుల ఫోటోతో మహేశ్వర్షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.