
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఒక ఉద్యోగి మహా కుంభమేళాలో కూడా ల్యాప్ టాప్ ముందేసుకుని కూర్చున్నాడు. అందరూ భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు చేస్తుంటే మనోడు మాత్రం సీరియస్గా ల్యాప్ టాప్లో వర్క్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం అతని ఫొటో నెట్టింట వైరల్ అయింది. మీమర్స్ ఇతనిపై సోషల్ మీడియాలో సెటైర్లు, ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగి ప్రయాగ్ రాజ్ నుంచి కాన్ఫరెన్స్ కాల్కు అటెంట్ అయ్యాడని సైటైర్లు పేలుతున్నాయి. ఇండియా ఈస్ నాట్ ఫర్ బిగినర్స్ అని కొందరు.. మోక్షం, జీతం రెండూ ఒకేసారి కావాలనుకుంటే ఇతనిని ఫాలో అవండని ఇంకొందరు మనోడి డెడికేషన్పై జోకులేస్తున్నారు. కానీ.. వాస్తవానికి కరోనా తర్వాత ఐటీ ఉద్యోగుల కష్టాలు అన్నీఇన్నీ కావు.
ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నారనే ఒకేఒక్క కారణంతో అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా కొన్ని కంపెనీలు, క్లైయింట్స్ ఉద్యోగులతో వర్క్ చేయించుకున్న పరిస్థితి ఉంది. ఐటీలో లేఆఫ్స్ పెరిగిపోవడం, కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న చాలామంది ఉద్యోగులు కంపెనీలు ఏం చెబితే అది చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. సినిమాకెళ్లినా థియేటర్లలో ల్యాప్ టాప్ ముందేసుకుని కూర్చుని జాబ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు కనిపిస్తూనే ఉన్నారు.
Also Read :- SBI బ్యాంకులోనే రైతుల ధర్నా
కరోనా తర్వాత లైఫ్స్టైల్ మాత్రమే కాదు వర్క్ లైఫ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆఫీస్కు వెళ్లి ఉద్యోగాలు చేసే రోజుల నుంచి ఇళ్లలో కూర్చుని, వైఫై పెట్టించుకుని ల్యాప్ టాప్స్లో ఉద్యోగాలు చేసేంతలా ఉద్యోగుల జీవితాలను కరోనా మార్చేసింది. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేయాల్సిందేనని నిబంధన అమలు చేస్తున్నప్పటికీ కొన్ని ఐటీ కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్క్ విధానంలో పనిచేయించుకుంటున్నాయి.