ఫొటోగ్రాఫర్ చంద్ కు జాతీయ స్థాయిలో ప్రైజ్​

ఫొటోగ్రాఫర్ చంద్ కు జాతీయ స్థాయిలో ప్రైజ్​

ఖమ్మం టౌన్, వెలుగు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ చంద్ కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఒడిస్సా స్టేట్ లో ఈనెల 5,6 తేదీల్లో సెవెంత్ నేషనల్  వర్క్ షాపు పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో బెస్ట్ పొటోగ్రాఫర్ గా చంద్ కు  అవార్డు లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక,మహారాష్ట్ర లకు చెందిన 120 మంది పోటీలో పాల్గొనగా వారిలో చంద్ కు అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.