ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముద్దు వివాదంలో చిక్కుకున్నారు. తన కేబినెట్లోని క్రీడా శాఖ మంత్రి, 46 ఏళ్ల వయసున్న మహిళ అయిన ఎమిలీ కాస్టెరా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు గాఢంగా ముద్దు పెట్టారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడైన మాక్రాన్ను అందరి ముందు ఇలా దగ్గరకు లాక్కుని మరీ క్రీడా శాఖ మంత్రి ముద్దు పెట్టుకోవడంపై పెను దుమారం రేగింది. ఈ ఇద్దరూ ముద్దు పెట్టుకున్న ఫొటో తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రెసిడెంట్ చెంపపై ఒక అనుభూతికి లోనై క్రీడా శాఖ మంత్రి గాఢంగా ముద్దు పెట్టడంతో ఈ ఇద్దరి సాన్నిహిత్యంపై రకరకాల ప్రచారాలు తెరపైకొచ్చాయి. ఎంతో ఆత్రుతతో ఆమె ముద్దు పెట్టిన ఈ దృశ్యం చాలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోశారు. ఒక అధ్యక్షుడు, ఒక మంత్రి ఇలా బహిరంగంగా ఇంత గాఢంగా ముద్దు పెట్టుకోవడం అసహ్యంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ ముద్దు మాక్రాన్ భార్య బ్రిగిట్టేకు కచ్చితంగా నచ్చదని నెటిజన్లు వెటకారం చేశారు.
ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారొ (Madame Figaro) తొలుత ఈ ముద్దు ఫొటోను ప్రచురించిది. ఈ ముద్దు చాలా వింతగా, విడ్డూరంగా ఉందని.. మంత్రి ఎమిలీ కాస్టెరా పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించాలని భావించి ఉండొచ్చని ఆ మ్యాగజైన్ రాసుకొచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వయసు కూడా 46 సంవత్సరాలే కావడం గమనార్హం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ను మంత్రి ఎమిలీ కాస్టెరా ముద్దు పెట్టుకున్నప్పుడు ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియేల్ అట్టల్ కూడా పక్కనే ఉన్నారు. ఈ ఇద్దరి ముద్దును, చనువును చూడలేక కావాలనే ఇంకెటో చూస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వయసు 46 సంవత్సరాలు కాగా, ఆయన భార్య బ్రిగిట్టే వయసు 71 సంవత్సరాలు.