న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న రెజ్లర్ బజ్రంగ్ పూనియా ప్రాక్టీస్ లో చెమటోడ్చుతున్నాడు. 2024లో జరిగే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ నెగ్గడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సోషల్ మీడియాలో బజ్రంగ్ షేర్ చేసిన ఫొటోలను బట్టి దేశం కోసం అతడు పడే కష్టం, అంకితభావం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇక స్కిప్పింగ్, కుస్తీ సాధన చేసిన ఫొటోలను ట్విట్టర్ లో పూనియా పోస్టు చేశాడు. ‘పెద్ద లక్ష్యాలను సాధించాలంటే భిన్నమైన అలవాట్లు ఉండాలి. దీన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో సాధించాలనే తపన, కసి ఉంటుంది. కానీ దాన్ని సరైన సమయంలో ఎలా వాడుకోవాలో ఛాంపియన్లకే తెలుస్తుంది’ అని ఆ పోస్టులకు పూనియా క్యాప్షన్ జత చేశాడు.
Big goal requires different habits.
— Bajrang Punia ?? (@BajrangPunia) March 30, 2022
Remember that.✌? pic.twitter.com/5lUcbAJy3c
బజ్రంగ్ ప్రాక్టీస్ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. అతడు నిజమైన ఛాంపియన్ అని.. బజ్ రంగ్ తమకు స్ఫూర్తి అంటూ పలువురు క్రీడాభిమానులు ఈ ఫొటోలకు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే, టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఫిజియో థెరపిస్ట్ లేకుండానే బజ్రంగ్ ప్రాక్టీస్ ను కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) స్పందించింది. సోనిపట్ లోని సాయ్ సెంటర్ లో పూనియాకు ఓ ఫిజియోను అరేంజ్ చేస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని వార్తల కోసం: