
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ సిటీలోని అజర హాస్పిటల్‌లో శుక్రవారం ఫిజియోథెరపీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మోహన్‌దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్‌రావు, శేషువర్ధన్, అన్వర్, శ్రీనివాస్, అజర హాస్పిటల్ నిర్వాహకులు అప్పాల సుధాకర్ హాజరయ్యారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అజర హాస్పిటల్‌లో యూఎస్ ఇంఫోర్టీడ్ ఎలకోఫ్రీథెరఫీ యూనిట్‌తో పాటు ఫిజియోథెరపీ సెంటర్లను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాగార్జునరెడ్డి, రామకృష్ణ, వంశీ, హరీశ్ పాల్గొన్నారు.