
జెడ్డా (సౌదీ అరేబియా): మెక్ లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్ ఫార్ములా వన్‌లో మూడో విజయం అందుకున్నాడు. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. దాంతో సీజన్ డ్రైవర్ల చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన సౌదీ గ్రాండ్ ప్రి ఫైనల్ రేసులో ఆస్ట్రేలియాకు చెందిన పియాస్ట్రి 1:21:06.758సె. టైమింగ్‌తో అందరికంటే వేగంగా పోడియం చేరుకున్నాడు. పోల్ పొజిషన్ నుంచి రేసు మొదలు పెట్టిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ( +2.843సె) రన్నరప్‌తో సరిపెట్టాడు.
ఫెరారీకి చెందిన చార్లెస్ లెక్లెర్క్ (++8.104 సె) మూడో స్థానంలో నిలవగా.. లాండో నోరిస్ (మెక్‌లారెన్; +9.196 సె), లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; +27.236 సె) టాప్–5లో చోటు దక్కించుకున్నారు. ఈ విజయం తర్వాత డ్రైవర్ల చాంపియన్‌షిప్‌లో ఆస్కార్ పియాస్ట్రి మొత్తంగా- 99 పాయింట్లతో తన టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. దాంతో 2010లో మార్క్ వెబర్ తర్వాత ఎఫ్1 డ్రైవర్ల జాబితాలో టాప్ ప్లేస్ సాధించిన తొలి ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. నోరిస్ - (89) రెండో స్థానానికి పడిపోగా.. వెర్‌స్టాపెన్ ( 87) మూడో స్థానంలో ఉన్నాడు.