పబ్లిసిటీ.. ఏ బిజినెస్ అయినా సరే జనాల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీనే చాలా కీలకం. అప్పట్లో ఊరూరా దండోరా వేయించి పబ్లిసిటీ చేసేవారు, ఆ తర్వాత రేడియో అనౌన్స్ మెంట్లు, వాల్ పోస్టర్స్, పాంప్లెట్స్, న్యూస్ పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్... ఇలా కాలం గడుస్తున్న కొద్దీ పబ్లిసిటీ తీరు మారుతూ వస్తోంది. ఇక, నయా జమానాలో ఎంత వెరైటీగా పబ్లిసిటీ చేస్తే బిజినెస్ అంత సక్సెస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రిటీస్ చేత ప్రమోషన్స్ చేయించే ట్రెండ్ నడుస్తోంది. ఇది చాలదన్నట్లు.. వెరైటీ ప్రమోషన్స్ చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేయాలన్న ఆలోచనతో మానవత్వాన్ని మరిచి వికృతంగా ప్రవర్తిస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఈ ఘటన చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది.
ALSO READ | ఉబెర్, రాపిడోతో ఇంత సంపాదనా? ఇతని స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
నిత్యం ట్రాఫిక్ జామ్ తో రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై భుజాలకు సైన్ బోర్డ్స్ తగిలించుకొని కొంతమంది నడుస్తూ కనిపించారు. అది గమనించిన ఓ నెటిజన్ ఆ సైన్ బోర్డ్స్ ని చూసి షాక్ అయ్యాడు.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కి సంబందించిన యాడ్ ఉన్న సైన్ బోర్డ్స్ అవి. ఆ సంఘటన చూసి చలించిపోయిన నెటిజన్... ఈ ఉదంతాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. లక్షకు పైగా వ్యూస్ తో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
VC : how much funding do you need ?
— Roshan (@roshanonline) December 6, 2024
Startup : 5 million $
VC : what's your customer acquisition plan
Then : Human ads
VC : Take my money pic.twitter.com/67BkVHLG1j
నెట్టింట వైరల్ అయిన ఈ పోస్ట్ కి సదరు ఫుడ్ డెలివరీ పై దుమ్మెత్తి పోస్తూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ యాప్ ని ప్లేస్టోర్ లో బ్లాక్ చేయాలని.. ఇది శ్రమ దోపిడీకి నిదర్శనం అని.. మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని.. దీన్ని మించిన అత్యంత చెత్త అడ్వర్టైజింగ్ టెక్నిక్ ఉండదని.. పాపం అంత బరువున్న సైన్ బోర్డ్స్ ని ఎంత దూరం నుండి మోస్తున్నారో అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.