స్వప్రయోజనాల కోసంజాతిని మందకృష్ణ మోసం చేస్తున్నడు : పిడమర్తి రవి

స్వప్రయోజనాల కోసంజాతిని మందకృష్ణ మోసం చేస్తున్నడు : పిడమర్తి రవి
  • ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

బషీర్​బాగ్, వెలుగు: మందకృష్ణ మాదిగ స్వప్రయోజనాల కోసం జాతిని మోసం చేస్తున్నాడని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్  పిడమర్తి రవి విమర్శించారు. నేతకాని కులస్తులపైన తుపాకీ పెట్టి మందకృష్ణ మాదిగ జాతిని కాల్చుతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఇన్ చార్జ్ నందు నరసింహారావుతో కలిసి ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగకు వర్గీకరణ ఇష్టం లేదని అందుకే వివిధ కుల సంఘాలతో సర్కారుకు రిప్రజెంటేషన్లు ఇప్పించారని ఆరోపించారు.  

వర్గీకరణ ఆపాలని అనేక కుట్రలు చేసినా రిపోర్టును మళ్లీ యధావిధిగా కేబినెట్ ఆమోదించడం అభినందనీయమనన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చట్టం కూడా ఇదే విధంగా ఉండాలన్నారు. మంద కృష్ణ మాదిగ ఎన్ని కుట్రలు చేసినా ట్యాంక్ బండ్​పై నుంచి దూకిన వర్గీకరణ ఆగదని అన్నారు. వర్గీకరణ చట్టమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మాదిగలకు కృతజ్ఞతలు తెలుపుతూ యాత్ర చేపడ్తామని  తెలిపారు.