బహుజనుల కాంక్షను చంపిన వ్యక్తి మంద కృష్ణ

బహుజనుల కాంక్షను చంపిన వ్యక్తి మంద కృష్ణ


 

  • కాంగ్రెస్​ నాయకుడు పిడమర్తి రవి విమర్శ

హైదరాబాద్, వెలుగు: బహుజనుల కాంక్షను చంపిన వ్యక్తి మంద కృష్ణ మాదిగ అని కాంగ్రెస్​నేత పిడమర్తి రవి ఆరోపించారు. బీజేపీ, ప్రధాని మోదీ వల్ల వర్గీకరణ జరిగినట్లు మంద కృష్ణ అంటున్నారని, మరి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు వర్గీకరణ చేస్తామని అనట్లేదని నిలదీశారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మాదిగలు 12శాతం ఉంటే 7 శాతం అంటున్నారని, ఇక్కడ బీజేపీ, టీడీపీ కూటమిని బలోపేతం చేయాలని  మంద కృష్ణ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటించారని, ఒకవేళ వర్గీకరణ చేస్తే ఎమ్మార్పీఎస్​కు మనుగడ ఉండదని మంద కృష్ణ కు వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు.  ఎమ్మార్పీఎస్​ని  కాంగ్రెస్ లో విలీనం చేయమని ఎమ్మార్పీఎస్ నేతలే కోరుతున్నారని రవి పేర్కొన్నారు.