కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉంటా: రవి 

తుంగతుర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున బరిలో ఉంటానని  ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌‌ మాజీ చైర్మన్‌‌ పిడమర్తి రవి తెలిపారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ..  తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని, కాంగ్రెస్​ రెండో జాబితాలో తన పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలంగా ఉందని,  బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థితో కట్టలు, కత్తులతో కాకుండా ప్రశ్నకు సమాధానం ఇచ్చే వ్యక్తిగా పోటీ పడతానన్నారు. గతంలో  పార్టీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయిందని , ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.