జడ్చర్లలో రోఫ్​ తయారీ కేంద్రం

హైదరాబాద్, వెలుగు: పిడిలైట్ ఇండస్ట్రీస్​అదెసివ్ ​బ్రాండ్​ రోఫ్, హైదరాబాద్ సమీపంలోని జడ్చర్లలో తన కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  ఈశాన్య కర్ణాటక మార్కెట్లలో అధిక నాణ్యత గల టైల్ అదెసివ్​(అంటుకునే) ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ఈ సదుపాయం కీలకంగా పనిచేస్తుందని పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ పూరి అన్నారు. ప్లాంటులో పర్యావరణానికి పెద్దపీట వేశామని తెలిపారు.