వామ్మో..ఇడ్లీలో బొగ్గు ముక్కలు

వామ్మో..ఇడ్లీలో బొగ్గు ముక్కలు

మణుగూరు, వెలుగు : సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలోని కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ క్యాంటీన్ లో ఇడ్లీలో బొగ్గు పెల్లలు రావడం కార్మికులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం కేపీయూజీ క్యాంటీన్ ఓ కార్మికుడు బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా ఇడ్లీలో బొగ్గు పెల్లలు రావడంపై కాంట్రాక్టర్ కు ఫిర్యాదు చేయడంతో నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది. 

సింగరేణి క్యాంటీన్లలో అందించే ఆహార పదార్థాల్లో క్వాలిటీ లేకపోవడంతో పాటు శుభ్రత కూడా పాటించడం లేదని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్​ చేశారు.