ఎక్స్​రేలో ఏంటి ఇదీ!

ఎక్స్​రేలో ఏంటి ఇదీ!

ఈ ఎక్స్​రేలో అచ్చం వడగళ్లు కురుస్తున్నట్టే కనిపిస్తోంది కదా! కానీ.. అక్కడ వర్షపు బిందువుల్లా కనిపించేవన్నీ ఒక రోగి శరీరంలో ఉన్న పరాన్నజీవులు. సామ్ ఘాలి అనే డాక్టర్​ ఈ ఫొటోను ఈ మధ్యే సోషల్‌‌‌‌మీడియాలో షేర్​ చేశాడు. అతని దగ్గరికి వచ్చిన ఒక రోగి బాడీని ఎక్స్​రే తీసినప్పుడు బాడీ అంతా ఇలా పరాన్న జీవులతో నిండిపోయి కనిపించింది. దాంతో.. ఆ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్​రేని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌‌‌‌ చేశాడు. ఆ పోస్ట్‌‌‌‌ ఇప్పుడు వైరల్‌‌‌‌గా మారింది. 

రోగి బాడీలో టేనియా సోలియం అనే టేప్‌‌‌‌వార్మ్ లార్వా సిస్ట్‌‌‌‌లు ఉండటం వల్ల అతనికి సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి వచ్చింది. సాధారణంగా టేప్‌‌‌‌వార్మ్ లార్వా ఉన్న పచ్చి లేదా సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వల్ల ఈ పరాన్నజీవి మనిషి బాడీలో చేరుతుంది. కొన్ని వారాల్లోనే గట్‌‌‌‌లో బాగా డెవలప్​ అవుతుంది. ఆ తర్వాత మృదు కణజాలాల్లోకి వలస వెళ్తుంది. అలా బాడీ మొత్తం వ్యాపిస్తుంది. అంతేకాదు.. ఇది ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. 

అదెలాగంటే.. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి వాడిన బాత్​రూమ్​ని సరిగ్గా క్లీన్​ చేయకుండా మరొకరు వాడితే.. వాళ్లకు కూడా వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్​రే తీసిన రోగి మాత్రం సరిగ్గా వండని పంది మాంసం తిని ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇలాంటి ఇన్ఫెక్షన్‌‌‌‌లు కండరాలు, చర్మాన్ని దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు దీని ఎఫెక్ట్‌‌‌‌ మెదడు మీద కూడా ఉంటుంది.