Pihu: పిల్లల సినిమానే కానీ, వెన్నులో వనుకుపుట్టిస్తుంది.. ఉత్కంఠరేపే పిహు

Pihu: పిల్లల సినిమానే కానీ, వెన్నులో వనుకుపుట్టిస్తుంది.. ఉత్కంఠరేపే పిహు

ఈ మధ్య సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధంలేకుండా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక అది మరింత ఎక్కువయింది. అయితే కామన్ గా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాకంటే.. మర్డర్లు, రేపులు, పోలీసులు, ఇన్వెస్టిగేషన్లు, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు ఉంటాయి. కానీ, అవేవి లేకుండా కూడా మన వెన్నులో వణుకుపుట్టించే సినిమా ఒకటి ఉంది. అది కూడా ఒకే ఒక రెండేళ్ల పాపతో చేశారు. సినిమా మొత్తం ఆ పాప మాత్రమే కనిపిస్తుంది. 

కానీ, ఆ పాప చేసే పనులు చూస్తే మనకే భయమేస్తుంది, కంగారు పడుతుంది, ఏమవుతుందో ఏమో అనే టెన్షన్ మొదలవుతుంది. అంతలా ఆ సినిమా మనల్ని కట్టిపడేస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో వచ్చిన పిహు. 2018లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. వీలుంటే వెంటనే చూసేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి. భయమేస్తుంది, థ్రిల్ గా కూడా ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా పిల్లల్ని వదిలిస్తే వారు తెలియకుండా చేసే చిన్న చిన్న పనులే ఎంతటి ప్రమాదానికి దారి తీస్తాయి అనే విషయాన్ని క్లియర్ గా చూపించాడు ఈ సినిమాలో. 

ఇక పిహు సినిమా కథ విషయానికి వస్తే.. పిహు రెండేళ్ల పాప. ఉదయం నిద్రలేచేసరికి ఆమె తల్లి చనిపోయి ఉంటుంది. పిహు ఆమెను లేపడానికి ట్రై చేస్తుంది కానీ, లేవదు. అలా పిహు బయటకు రాలేక ఇంట్లోనే చిక్కుకుపోతుంది. తాను వాళ్ళ అమ్మ చేసేటప్పుడు చూసిన పనులను అనుసరిస్తూ.. ఫ్రిడ్జ్, గ్యాస్, గీజర్, ఇరోహాన్ బాక్స్, మైక్రో ఒవేన్ లాంటి వాటిని తెలియకుండానే ఆన్ చేసి పెడుతుంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. మరి ఆలా ప్రమాదకరమైన పరిస్థితి నుండి పిహు ప్రాణాలతో బయటపడిందా? లేదా? అనేది మిగిలిన కథ.