- పురస్కారాన్ని అందుకున్నటీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్
న్యూఢిల్లీ, వెలుగు: చర్లపల్లి పారిశ్రామిక పార్క్ కు ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్కామర్స్ ఆఫ్ ఇండియా(ఫిక్కీ) అవార్డు వరించింది. ఫిక్కీ సంస్థ స్వచ్ఛ ఇండస్ట్రియల్ పార్క్ లకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) "ఎన్విరాన్మెంటల్ ససైనబుల్ చాంపియన్" విభాగంలో ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నది. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ...రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వచ్చే పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించేలా టీజీఐఐసీ కృషి చేస్తోందని ప్రశంసించారు.