- పూర్తి వివరాలతో పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల మార్పును సవాలు చేస్తూ ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. పూర్తి స్థాయి వివ రాలతో పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తల్లి విగ్రహాల మార్పునకు సం బంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా తెలంగా ణ తల్లి విగ్రహానికి సంబంధించిన కేబినెట్ నిర్ణయాన్ని, దానికయ్యే రూ.150 కోట్ల వివరాలను ఎక్కడా ప్రస్తావించలేదనగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పూర్తి వివరాలతో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు.