ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్

ఎస్ఎల్బీసీ  టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్ఎల్ బీసీ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్‌ పిల్ దాఖలు చేశారు.  ఘటన జరిగి 10రోజులైనా కార్మికుల ఆచూకీ లేదని పిటిషనర్ తెలిపారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.. టన్నెల్‌ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్ పాల్గొని 24గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కోర్టుకు తెలిపారు. సహాయక చర్యలను  ప్రభుత్వం సైతం ఎప్పటికపుడు పరిశీలిస్తోందని చెప్పారు.  ఏజీ వివరాలను నమోదు చేసిన హైకోర్టు  ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.

Also Read :- కొత్తగా పెళ్లయినోళ్లంతా వెంటనే పిల్లల్ని కనండి

మరో వైపు ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ పనుల్లో మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే..