కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో మనందరికి తెలుసు. కోవిడ్ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు.కోవిడ్ వైరస్ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశాయి. కొన్ని దేశాలు సక్సెస్ అయి కొన్ని రకాల వ్యాక్సిన్లను అందు బాటులోకి తెచ్చాయి. అటువంటి వ్యాక్సిన్లలో కోవీసీల్ట్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటి వాడకం వల్ల అప్పటి పరిస్థితుల్లో కొంత ఉపశమనం కలిగించినా .. వాటిపై పలు సందేహాలుండేవి..అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ న్యాయవాది కోవీషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్ లపై సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ వాడకంలో చాలా రిస్క్ ఉన్నాయని.. వాటిని వైద్య నిపుణులచేత అధ్యయం చేయించాలని PIL దాఖలు చేశారు న్యాయవాది విశాల్ తివారీ. అంతేకాదు COVID 19 సమయంలో టీకా డ్రైవ్ ఫలితంగా నష్టపోయిన ప్రజలకు నష్ట పరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేయాలని పిటిషన్ లో కోరారు.
Also Read:శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ ఫార్ములా ను పుణె కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందిందని.. ఈ వ్యాక్సిన్ తో రక్తం గడ్డ కట్టడానికి సంబంధించిన దుష్ప్రభావం కలిగే అవకాశం ఉందని తివారీ తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు.. ఇందుకు సాక్ష్యంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా తన COVID 19 వ్యాక్సిన్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) తో థ్రాంబోసిస్ కారణమవుతుందని అంగీకరించిన యూకే కోర్టు పత్రాలను కోర్టుకు సమర్పించారు.
కోవిడ్ 19 తర్వాత ప్రజల్లో గుండెపోటు ఎక్కువైందని.. ముఖ్యంగా యువకులలో గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోవడం పెరిగాయని తివారి తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. భారత దేశంల 175 కోట్లకుపైగా కోవిషీల్డ్ డోస్ లు అందించబడ్డాయని చెప్పారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తో TTS కు కారణమవుతుందని దీంతో ప్లేట్ లెట్స్ పడిపోయవడం, రక్త గడ్డకట్టడం సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
భారత ప్రజల ఆరోగ్యం, భద్రత ను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ పిటిషన్ నొక్కి చెబుతుంది.. భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాలను నివారించేందుకు ఈ సమస్యకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది.