తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

తిరుపతి లడ్డూలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఆచారం హిందూ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని పిటిషనర్ వాదించారు. 

తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై సిట్ తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రైతు, హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన వేశారు. టీటీడీలో భక్తులకు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని వడ్డిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. 

తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తున్నారని, హిందువుల ఆగ్రహానికి గురి చేసిందని అన్నారు.సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ తెలిపారు.  

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినయోగం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ టెస్టింగ్  రిపోర్టులు చెబుతున్నాయి.